డబుల్ సెంచరీ దాటిన హైడ్రా కూల్చివేతలు

తెలంగాణ రాష్ర్టంలో చెరువు భూములు కబ్జా చేసి ఇల్లు కట్టిన వారికి గుండె గుబేలు!

డబుల్ సెంచరీ దాటిన హైడ్రా కూల్చివేతలు

తెలంగాణ :

డబుల్ సెంచరీ దాటిన హైడ్రా కూల్చివేతలు - తెలంగాణ రాష్ర్టంలో చెరువు భూములు కబ్జా చేసి ఇల్లు కట్టిన వారికి గుండె గుబేలు!డబల్ బెడ్ రూమ్స్ బాధితులు కి ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.

 మొత్తం 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు ప్రభుత్వానికి నివేదించింది.


హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బంది 


హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని సైతం కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. ఈ సిబ్బంది కేటాయింపుతో ఆక్రమణల తొలగింపు చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.


మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సైతం చెరువులు చెరపట్టిన వారికి చెరసాల తప్పదని హెచ్చరించారు. కబ్జాదారులు ఎంత గొప్ప వ్యక్తులైనా వదిలిపేట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, 11,000ల మంది బాధితులకు రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని రేవంత్​రెడ్డి ప్రకటించారు.

Tags:

Related Posts

Advertisement

Latest News