అంగణవాడి కేంద్రాలకు,కార్యకర్తలకు స్థలాలు కేటాయిస్తాం : ఈశ్వర్

అంగణవాడి కేంద్రాలకు,కార్యకర్తలకు స్థలాలు కేటాయిస్తాం : ఈశ్వర్

పామిడి :


మండల కేంద్రమైన పామిడిలోని అంబేద్కర్ భవనంలో శుక్రవారం మహిళా అభివృద్ధి-శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనశిక్షణ సంస్థాన్ సహకరంతో  అంగణవాడి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంతకల్లు ఎంయల్ఎ గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ 2 నుంచి5సంవత్సరాల పిల్లలను వారి తల్లిదండ్రుల కంటే మిన్నగా నిష్పక్షపాతంగా రాష్ట్రంలో అందరికన్నా  సేవాదృత్పదంతో మానవతా భావ  మాతలుగా తమ వృత్తిని అవలంభిస్తున్నారని కొనియాడారు.అంగణవాడి కేంద్రాలు అద్దె భవనాలు కాకుండా ప్రభుత్వ స్థలాలను కేటాయించి ప్రభుత్వంచే పక్కా భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన కార్యకర్తలకు కూడా నివేస స్థలాలు కేటాయించి ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు.అంగణవాడి కేంద్రాల సృష్టికర్త మనప్రియతమ నాయకుడు  చంద్రబాబు నాయుడన్నారు.సిడిపిఓ డిల్లేశ్వరి మాట్లాడుతూ మండలవ్యాప్తంగా 57కేంద్రాలు వున్నాయని, పట్టణంలో18 వున్నట్లుగా సిడిపిఓ డిల్లేశ్వరి తెలిపారు.గర్భిణీ స్త్రీలు కలిసితం లేని ఆకుకూరలు తినాలని పంటపొలాల్లో గాని ఇంటిపెరట్లోగాని పండించవచ్చని వాటిలో మునగాకు పలకాకు కూరలు ఎంతో మంచిదన్నారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు ఈశ్వర్ చేతుల  మీదుగా పసుపు కుంకుమ గాజులు రవికలు ఇచ్చి శ్రీమంతంచేసారు. పసిపిల్లలకు పౌష్టికాహారం అందించారు. ఈకార్యక్రమంలో గుమ్మనూరు ఈశ్వర్,సిడిపిఓ డిల్లేశ్వరి, ఎసిడిపిఓ నాగమణి, సూపర్ వైజర్లు రామలక్ష్మి, లక్ష్మి నారాయణమ్మ,కోఆర్డినేటర్ పులికంటి యుగంధర్, జనశిక్షణ సంస్థాన్ కార్యదర్శి రషీద్ ఖాన్,మండల టీడీపీ నాయకులు ఆర్ ఆర్ రమేష్, ప్రబాకర్ చౌదరి, బొల్లు శ్రీనివాస్ రెడ్డి,పాళ్యం నారాయణస్వామి,టీచర్ రామాంజనేయులు,గౌస్,మోహన్ కృష్ణ,అశోక్, రంగస్వామి, మండ్లరాజు,సుబ్బారెడ్డి, నరసింహుడు,హమాలి గోపాల్ గోమాతిశంకర్,కల్లమడి కొండయ్య,గురుదాస్, సుంకిరెడ్డి, అనుంపల్లిశివ,పల్లె శ్రీనివాసులు,హనుమంతరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, మారుతిరెడ్డి,నీలూరు ఓబిళేసు తదితర టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.IMG-20240907-WA0004

Tags:

Related Posts

Advertisement

Latest News