ప్రతీ ఇంటికి సహాయం అందించాలి.. మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయండి : సీఎం చంద్రబాబు

ప్రతీ ఇంటికి సహాయం అందించాలి.. మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయండి : సీఎం చంద్రబాబు

విజయవాడ : 


కాలినడకన బురదలోనే మంత్రులు..
మూడు వేల మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు సహాయక చర్యలను పర్యవేక్షించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో.. బోట్ల ద్వారా ముంపు బాధిత ప్రజలకు టిడిపి నేతలు ఆహారాన్ని అందిస్తున్నారు. బుడమేరు నీటి ఉధృతిపై అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్షించారు. బస్సులు, పడవలు ద్వారా ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ బాలాజీ కోరారు. మరోవైపు.. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సరియైన రహదారి లేకపోవడంతో బురదలోనే కాలినడకన గండిపడిన ప్రాంతానికి మంత్రులు వెళ్లారు. బుడమేరుకు విజయవాడ నగరం వైపు మూడు గండ్లు, మరోవైపు నాలుగు గండ్లు పడ్డాయి. ఒక్కో గండి దాదాపు 50మీటర్ల పైనే ఉండటం, వరద ఉదృతంగా ఉండటంతో గండ్లు పూడ్చే పనులు ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది. ఎట్టకేలకు బుడమేరుకు పడిన మొదటి గండిని అధికారులు పూడ్పించారు. మిగిలిన గండ్లూ యుద్ధప్రాతిపదికన పూడ్చేలా పనులు వేగంగా చేపట్టాలని లోకేశ్, రామానాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:

Related Posts

Advertisement

Latest News