జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ తరపున కొన్ని కీలక ప్రతిపాదనలు చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
ఢిల్లీ
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ తరపున కొన్ని కీలక ప్రతిపాదనలు చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.మొత్తం ఎనిమిది అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ ఎదుట ప్రతిపాదనలు చేసారు.పేదలకు ఊరటనిచ్చేలా, కొన్ని కీలక రంగాలకు ప్రొత్సహం ఇచ్చేలా వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరతూ పయ్యావుల ప్రతిపాదనలు.ఏపీకి లబ్ది చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను కోరిన ఆర్థిక మంత్రి వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్వాహాకులకు ఏపీ ఆర్థిక మంత్రి ఆహ్వానం.
ఏపీ నుంచి పయ్యావుల ప్రతిపాదనలు
ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పోరేషన్ సేవలపై ఉన్న జీఎస్టీని మినహాయించాలి.
మద్యం తయారీలో వినియోగించే ఎక్సట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవాలి.
జీవిత, ఆరోగ్య బీమాలపై 15 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలి.
వృద్ధులు,మానసిక వికలాంగులకు జీవిత,ఆరోగ్య బీమాలపై ఉన్న జీఎస్టీ పన్నును మినహాయించాలి.
ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీలో వెసులుబాటు కల్పిస్తే సామాన్య ప్రజలకు భారం తగ్గుతుంది.
ఎలక్ట్రిక్ వాహానాల విడి భాగాలపై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి కుదించాలి.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పైనా జీఎస్టీని తగ్గించాలి.
ఈవీ రంగానికి జీఎస్టీ నుంచి వెసులుబాట్లు కల్పిస్తే పర్యావరణహిత సమాజం ఏర్పడడానికి మరింత ఊతమిచ్చినట్టు అవుతుంది.
జీఎస్టీ చట్టం సెక్షన్ 16(4) ఉన్న ఇబ్బందులను తొలగించి.. ట్యాక్స్ పేయర్స్ ప్రయోజనాలను కాపాడాలి.
విద్యా సంస్థలు, యూనివర్శిటీల్లో శాస్త్ర సాంకేతికతను ప్రొత్సహించేందుకు వచ్చే గ్రాంట్లపై జీఎస్టీ నుంచి మినహాయించాలి.