ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం

ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం

విశాఖపట్నం :

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత.. పాత భవనాల వద్ద ఉండొద్దని అధికారుల సూచన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షసూచన, రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు.
  
విశాఖలో సైక్లోన్‌ కంట్రోల్‌ రూమ్‌ లు ఏర్పాటు

(విశాఖ) : విశాఖ నగరంలో తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల సహాయార్థం విశాఖపట్నం కలెక్టరేట్‌, పోలీసు కంట్రోల్‌ రూం లతో పాటు పలు తహశీల్దార్‌ కార్యాలయాలలో 24/7 పనిచేసే విధంగా కంట్రోల్‌ రూమ్‌ లు ఏర్పాటు చేయటం జరిగిందని అధికారులు తెలిపారు.

విశాఖపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891-2590102, 0891-2590100, 
పోలీసు కంట్రోల్‌ రూం0891-2565454, డైల్‌ – 100, డైల్‌ – 112,
ఆనందపురం తహశీల్దార్‌ కార్యాలయం 9700501860,
 భీమిలి తహశీల్దార్‌ కార్యాలయం 9703888838, 
పద్మనాభం తహశీల్దార్‌ కార్యాలయం 7569340226 , 
చినగదిలి తహశీల్దార్‌ కార్యాలయం 9703124082, 
పెందుర్తి తహశీల్దార్‌ కార్యాలయం 7702577311 ,
సీతమ్మధార తహశీల్దార్‌ కార్యాలయం, మహారాణిపేట తహశీల్దార్‌ కార్యాలయం 9182807140,
గోపాలపట్నం 7842717183 తహశీల్దార్‌ కార్యాలయం, 
ములగాడ తహసిల్దార్‌ కార్యాలయం 9440552007,
 గాజువాక తహసిల్దార్‌ కార్యాలయం 8886471113 ,
 పెదగంట్యాడ తహసిల్దార్‌ కార్యాలయం 9948821997 తుఫాను కారణం గా
 ప్రజలకు ఏదైనా సహకారం కావాలంటే పై నెంబర్‌ లలో సంప్రదించాలని అధికారులు కోరారు.

Read More వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

వర్షపాతం వివరాలు :

విశాఖపట్నం లో గడిచిన 24 గంటల్లో సగటున 60.7 మిల్లీమీటర్ల చొప్పున మొత్తం 668.2 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయిందని అధికారులు తెలిపారు. అత్యధికం గా భీమిలి 87.0 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పం గా పెందుర్తి 42.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో మహారాణిపేట 74.4 మిల్లీమీటర్ల, సీతమ్మధార 72.6 మిల్లీమీటర్ల, ఆనందపురం 68.8 మిల్లీమీటర్లు, విశాఖపట్నం రూరల్‌ 66.4 మిల్లీమీటర్లు, పెదగంట్యాడ 55.8 మిల్లీమీటర్లు, పద్మనాభం 53.6 మిల్లీమీటర్లు, గోపాలపట్నం 52.4 మిల్లీమీటర్లు, ములగాడ 48.6 మిల్లీమీటర్లు, గాజువాక 45.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Tags:

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్