ఏపీలో పత్తి కొనుగోలుకు 50 కేంద్రాలు

పత్తి మద్దతు ధర క్వింటాకు ₹7,521

ఏపీలో పత్తి కొనుగోలుకు 50 కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ :

ఏపీలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు రాష్ట్రంలో 50
కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. 

ఈ ఏడాది 5.79 లక్షల హెక్టార్ల సాగులో 6లక్షల టన్నుల దిగుబడి అంచనా వేశామని, గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేస్తామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ప్రమాదాల నివారణకు అగ్నిమాపక
చర్యలతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే పత్తి క్వింటా ₹7,521 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని తెలిపారు.

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

Tags:

Related Posts

Advertisement

Latest News