వాయుగుండం తాజా సమాచారం

వాయుగుండం తాజా సమాచారం

విజయవాడ :

ప్రస్తుతం వాయుగుండం వాయువ్య బంగాళాఖాతంలో నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ ఉంది. ఇది కళింగపట్నంకు తూర్పు దిశగా 250 కి.మీ, గోపాల్పూర్ కు తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ, పారాదీప్ కు దక్షిణంగా 270 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది ఉత్తర దిశగా ప్రయాణించి మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం! రేపు రాత్రికి పూరీ(ఒడిశా)-దిఘా(పశ్చిమబెంగాల్) మధ్య తీరం దాటే అవకాశం ఉంది. పారాదీప్ కు అతి దగ్గరలో కొంత భాగం తాకే అవకాశం ఉంది.

Tags:

Related Posts

Advertisement

Latest News