దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం

హైదరాబాద్ :

సాధారణంగా పండగల సందర్భంగా ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఇక తెలంగాణలో పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా అంటే జనం భారీగా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఈ సమయంలోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా.. ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి పండగల సీజన్‌లో కూడా తెలంగాణ ఆర్టీసీకి భారీగా వసూళ్లు వచ్చాయి. ఈనెల 1 నుంచి 15వ తేదీ మధ్య 15 రోజుల్లోనే కోట్లమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయగా.. రూ.300 కోట్లకు పైగా ఆర్టీసీకి ఆదాయం వచ్చింది.


దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 కోట్ల 7 లక్షల 73 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించినట్లు టీజీఎస్ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. ఫలితంగా ఈ 15 రోజుల్లో ఆర్టీసీకి రూ.307.16 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపాయి. ఇక ఈ బతుకమ్మ, దసరా పండగల వేళ.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా పండగ రద్దీ కోసం 10, 512 అదనపు బస్సులను తిప్పినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


ఇక తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దసరా ఆదాయంలో నెంబర్ వన్‌గా నిలిచిందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.శ్రీదేవి వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 15 రోజుల్లోనే రూ.39.22 కోట్ల ఆదాయం సమకూర్చి ఆల్ టైం రికార్డ్ నెలకొల్పినట్లు ఆమె తెలిపారు. మొత్తం 740 ప్రత్యేక బస్సులతో.. 52.73 లక్షల కిలోమీటర్లను నడిపినట్లు చెప్పారు. అదే సమయంలో 69.83 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చినట్లు వివరించారు. కేవలం ఒక్క 14వ తేదీన 4.97 లక్షల మంది ప్రయాణించగా..రూ.3. 33 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.


కరీంనగర్‌ రీజియన్‌లో పండగకు రూ.31.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 1 వ తేదీ నుంచి 16 రోజుల్లో 11 డిపోల పరిధిలో 980 బస్సులు నడపగా.. 61.12 లక్షల మంది ప్రయాణించారు. దాదాపు రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని.. రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించినట్లు చెప్పారు

Tags:

Related Posts

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్