ఏపీ ప్రజలకు తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం : నాదెండ్ల మనోహర్

విజయవాడ వంట నూనె దిగుమతిదారులతో మంత్రి నాదెండ్ల సమావేశం

ఏపీ ప్రజలకు తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం  : నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్  ::

కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కలిగించిందన్న నాదెండ్ల ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతోందని వెల్లడి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న వంట నూనె దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. విజయవాడ సివిల్ సప్లయ్స్ భవనంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించిందని తెలిపారు. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెను అందించాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అందులో భాగంగా పామాయిల్ లీటరు రూ.110. సన్‌ప్లవర్ ఆయిల్ రూ.124కే ప్రజలకు అందుబాటులో ఉంచామని నాదెండ్ల వివరించారు. ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. దీంతో దిగుమతి దారులు నుంచి ఇబ్బందులు లేకుండా సప్లయ్ పెంచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లయ్ పెంచాలని, అదే సమయంలో సకాలంలో సప్లయ్ అందించాలని కోరామని వెల్లడించారు.

Tags:

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్