బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు

కడప జిల్లా ఎస్పీ వెల్లడి

బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు

కడప : 

బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రొద్దుటూరు దస్తగిరమ్మ అనే 16 ఏళ్ల బాలికను దహనం చేసిన దారుణఘటనపై వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ విషాద సంఘటన 19 అక్టోబర్ 2024న, గోపవరం మండలం లోని పి పి కుంట సమీపంలో, సెంచురీ ప్యానెల్ ప్యాక్టరీ ఎదురుగా వున్న అటవీ ప్రాంతంలో జరిగింది.
ప్రాదమిక దర్యాప్తు ప్రకారం, బాధితురాలు బద్వేల్లోని బిజఎస్ఆర్ కళాశాల విద్యార్థిని. ఆమెకు తమ ఇంటి ఎదురుగా వున్న 19 ఏళ్ల వయస్సున్న జక్కల విఘ్నేష్ తో ప్రేమ వ్యవహారం వుండినది. అయితే సుమారు 6 నెలల క్రితం అతడు మరో మహిళను వివాహం చేసుకున్నాడని, సంఘటన జరిగిన రోజు ఉదయం దస్తగిరమ్మను రహస్యంగా పి. పి. కుంట సమీప అటవీ ప్రాంతంలో రహస్యముగా కలుసుకోవాలని ఆమెను అక్కడకు వచ్చేటట్లు చేసి, ఆమెతో కలసి సెంచరీ ఫ్యాక్టరీ సమీపంలోని అడవిలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ విఘ్నేశ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుండి పారిపోయాడు. తరువాత ఆమె పోలీసుల సహాయంతో బద్వేలు ఆస్పత్రికి వచ్చి అక్కడినుండి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కడపకి రాబడి, బర్న్స్ వార్డులో చికిత్స పొందుతూ కొలుకోలేక 20.10.2024 ఉదయం 00.38 గంటలకు మరణించినది.

ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని త్వరితగతిన అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని కడప పోలీసులు ఈరోజు విజయవంతంగా పట్టుకున్నారు.

- నిందితులను త్వరితగతిన అరెస్టు చేయడానికి కృషి చేసిన కడప పోలీసుల సత్వర మరియు సమర్ధవంతమైన చర్యకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినందించారు.

Read More వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

- నిందితులకు వ్యతిరేకంగా దృఢమైన సాక్ష్యాలను సేకరించేందుకు బద్వేల్ రూరల్ పోలీసుల నేతృత్వంలోని విదారణ శాస్త్రీయ మార్గాల్లో నిర్వహించబడుతుంది. 19.10.2024 తేదీ పెట్రోల్ బంక్ వద్ద నిందితుడు ఉన్నట్లు నిర్ధారించే CCTV ఫుటేజీతో సహా క్లిష్టమైన శాస్త్రీయ ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. నేర స్థలంలో నిందితుడు నేరానికి ఉపయోగించిన పెట్రోల్ బాటిల్, మరియు ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించాడు. నిందితుడు జక్కల విఘ్నేష్ పదకం ప్రకారం నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. పథకం ప్రకారం అతడు తన మొబైల్ ఉపయోగించకుండా  కదప లోనే వుంచి, తన భార్య మొబైల్ ఫోన్ మాత్రమే వాడినట్లు గుర్తించారు. తన భార్య మొబైల్ ఫోన్ లోని కాల్ డేటా. తనను గుర్తించకుండా ఉండేందుకు తొలగించినట్లుగా గుర్తించడం జరిగింది.

నిందితుల అరెస్టు వివరాలు :

20.10.2024న మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో జక్కల విఘ్నేష్. వయసు: 19 సంవత్సరాలు, S/o చంద్రశేఖర్, 7/౦ రామాంజనేయనగర్, బద్వేల్, (ప్రస్తుతం కడప ఒంశాంతి నగర్ లో వుంటున్న) అను నిందితుడిని కడప నగర శివార్లలోని DTC సమీపంలో బద్వేల్ రూరల్ సి. ఐ. తన సిబ్బందితో కలసి అరెస్టు చేశారు.విచారణ సమయంలో, మృతురాలు తనను పెళ్లి చేసుకోవాలని తరచుగా కోరుతున్నందున, ఆమె నుండి వస్తున్న ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి, ఒక ముందస్తు ప్రణాళికతో అతను మృతురాలిని పి.పి. కుంటకు రావాలని కోరినట్లు అతను వెల్లడించాడు. ఆమెను కలిసేందుకు కడప నుంచి బద్వేల్కు బైక్ పై వస్తూ దారిలో అలం ఖాన్ పల్లి సమీపంలోని ఓ పెట్రోల్ బంక్లో తన బైక్ కు పెట్రోల్ పట్టించుకోని, తరువాత తన టైక్ ట్యాంక్ పైపు నుండి, ఒక బాటిల్లోకి పెట్రోలు పట్టుకుని, దానిని తన బ్యాగ్ లో పెట్టుకొని ఆమెను కలుసుకుని ఇద్దరూ కలసి పీపీ కుంట సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అక్కడ ఆమెతో శారీరకంగా కలిసిన తర్వాత, ఆమె తన వివాహం గురించి అడగడంతో, వారి మధ్య వాగ్వాదం జరిగింది. అంతట ఉదయం 9.00 గంటల సమయంలో అతను ఆమె గొంతు నొక్కి కిందకు నెట్టాడు, ఆమె కింద పడి స్పృహ కోల్పోగా, నిందితుడు తాను తెచ్చుకున్న బాటిల్ లోని పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించి, మంటలు రేగిన తర్వాత అతడు ఘటనా స్థలం నుంచి రోడ్డుపైకి వచ్చి ఆటోలో పరారయ్యాడు.

నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు మరియు మృతురాలి బట్టలు, మృతురాలి తరగతి పుస్తకాలు వున్న ఆమె బ్యాగు, సగం కాలిన ఒక ఖాళీ పెట్రోల్ బాటిల్, సంఘటనా స్థలంలో నిందితుడు తాగి పడేసిన సిగరెట్ పీక ఒకటి, మృతురాలి కాలిన బట్టల బూడిద, నేరం జరిగిన ప్రదేశంలో కనుగొని పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టు ముందు హాజరు పరుస్తున్నారు.

సత్వర న్యాయం కోసం ప్రత్యేక కోర్టు

క్రూరమైన నేరాల యొక్క బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా, ఈ కేసు లైంగిక వేదింపుల కేసుల్లో త్వరితగతిన విచారణ కోసం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక కోర్టుకు సిఫార్సు చేయబడుతుంది. నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా సాక్ష్యాధారాలను సేకరించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్