ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
సివిల్, క్రిమినల్, రెవెన్యూ కోర్టులు ట్రిబ్యునల్స్ న్యాయ లేదా పాక్షిక న్యాయ విధులను నిర్వర్తించే అధి కారం ఉన్నవారు ఉచిత న్యాయ సేవలను అందించే సంస్థలు
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ
సబ్ డివిజనల్ లీగల్ సర్వీసెస్ కమిటీ
జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ
రాష్ట్రీయ లీగల్ సర్వీస్ అథారిటీ
జిల్లా స్థాయి లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీలు
ఉచిత న్యాయ సహాయంలో ఏ అంశాలు ఉంటాయి ?
టైపింగ్ ఫీజులు, గుమస్తా ఫీజు, ప్రాసెస్ ఫీజులు, డ్రాఫ్టింగ్ ఫీజులు, న్యాయవాదుల ప్యానెల్ ఫీజులను న్యాయసేవా సంస్థలు భరిస్తాయి.
వ్యాజ్యం నందు న్యాయవాది ఉచితంగా ప్రాతినిధ్యం వహిస్తారు.
తగిన సందర్భాల్లో ఏదైనా చట్టపరమైన చర్యలకు సంబంధించి ప్రాసెస్ ఫీజు, సాక్షులు ఖర్చులు, ఇతర ఛార్జీలను చెల్లించక్కరలేదు.
అభ్యర్థనల తయారీ, అప్పీల్ మెమో, న్యాయవాద చర్యలలో పత్రాల ముద్రణ అనువాదం సహా కాగితపుపుస్తకం వంటి సేవలను ఉచితంగా అందిస్తారు.
న్యాయవాద పత్రాల ముసాయిదా, స్పెషల్ లీవ్ పిటిషన్ మొదలైనవి
న్యాయవాద చర్యల్లో తీర్పులు ఉత్తర్వులు, సాక్ష్యాల గమనికలు, ఇతర పత్రాల ధృవీకరించిన కాపీల సరఫరా.