యూఏఈ, దుబాయ్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇక మరింత ఈజీగా వీసా

యూఏఈ, దుబాయ్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇక మరింత ఈజీగా వీసా

భారత్ నుంచి చాలా మంది దుబాయ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ - యూఏఈకి వెళ్తూ ఉంటారు. కొందరు చదువుల కోసం, విహారయాత్రల కోసం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. అందులో కొందరు అక్కడే స్థిరపడిపోతూ ఉంటారు. వారిని చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాంటి వారు ముందుగానే వీసా, పాస్‌పోర్టు కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే ఇలా తాత్కాలికంగా యూఏఈ వెళ్లాలనుకుంటున్న భారతీయులకు అక్కడ ఉన్న భారత ఎంబసీ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు.


యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లే భారతీయులు ఇక అక్కడి ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే వీసా పొందే అవకాశం ఇప్పటినుంచి అందుబాటులోకి వచ్చింది. దీనికోసం వీసా-ఆన్‌-అరైవల్‌ను యూఏఈ ప్రారంభించినట్లు అక్కడ ఉండే భారత రాయబార కార్యాలయం తాజాగా వెల్లడించింది. ఈ వీసా-ఆన్‌-అరైవల్‌ అందుబాటులోకి రావడం వల్ల అర్హత కలిగిన భారతీయ పౌరులకు 14 రోజుల వ్యవధితో కూడిన వీసాను యూఏఈ ఎయిర్‌పోర్టులోనే అందిస్తారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ వీసా-ఆన్‌-అరైవల్‌కు సంబంధించిన పలు విషయాలను భారత ఎంబసీ వెల్లడించింది.


అయితే అందరూ ఈ వీసా-ఆన్‌-అరైవల్‌ కింద వీసాను పొందలేరని తెలిపింది. అమెరికా జారీచేసిన గ్రీన్‌ కార్డు లేదా యూఏఈలో చెల్లుబాటు అయ్యే వీసా.. యురోపియన్‌ యూనియన్‌ దేశాలు ఇచ్చే రెసిడెన్స్.. లేదా యూకే దేశాలు ఇచ్చిన రెసిడెన్స్‌, వీసాలు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ వీసాలను పొందవచ్చని పేర్కొంది. పైగా కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఉండేలా చూసుకోవాలని వెల్లడించింది. అయితే ఈ వీసా-ఆన్‌-అరైవల్‌ కింద మొదట 14 రోజుల వ్యవధితో కూడిన వీసాను అందిస్తాని.. పరిస్థితిని బట్టి.. దాన్ని మరో 14 రోజులు పొడిగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఒకవేళ పొడిగింపు వీలుకాని 60 రోజుల వ్యవధితో కూడిన వీసాను కూడా తీసుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. అవసరం ఉన్న భారతీయ పౌరులు దీన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.

Tags:

Related Posts

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్